ఆ ఆరు రాష్ట్రాల ప్రభావం 31శాతం..! - Lockdown In Six States Likely To Impact 31 Per Cent Of Indias Car Market
close

Updated : 20/04/2021 23:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఆరు రాష్ట్రాల ప్రభావం 31శాతం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ సహా ఆరు రాష్ట్రాల్లో విధించిన కొవిడ్‌ ఆంక్షల కారణంగా భారత్‌లోని కార్ల మార్కెట్‌పై 31శాతం ప్రభావం ఉండవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దిల్లీతో పాటు మహారాష్ట్ర,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,  ఛత్తీస్‌గడ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు, కొవిడ్‌ ఆంక్షలను విధించారు.  ఈ ప్రభావం మూడోవంతు ప్యాసింజర్‌ కార్ల విక్రయాలపై చూపిస్తుందని ఆంగ్లపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఆటో నివేదిక పేర్కొంది. ఇప్పుడిప్పుడే  కోలుకుంటున్న ఆటోమొబైల్‌ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 

ఇప్పటికే వివిధ పరిశ్రమలకు చెందిన 710  మంది సీఈవోలపై సీఐఐ నిర్వహించిన ఓ సర్వేలో దాదాపు 75శాతం మంది లాక్‌డౌన్‌ సరుకు రవాణపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఈ సరుకులు పరిశ్రమల ఉత్పత్తిలో అత్యంత కీలకమైనవి. ఒక వేళ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే ఆ ప్రభావం 50శాతం వరకు ఉంటుందని 56 మంది సీఈవోలు వెల్లడించారు. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని