త్వరలో ఐపీవోకు లోధా డెవలపర్స్‌..! - Lodha Developers files draft papers with SEBI for Rs 2500 cr IPO
close

Published : 17/02/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో ఐపీవోకు లోధా డెవలపర్స్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ లోధా డెవలపర్స్‌ ఐపీవోకు వచ్చేందుకు మూడోసారి ప్రయత్నాలను మొదలుపెట్టింది. గతంలో రెండు సార్లు ప్రయత్నించినా వివిధ కారణాలతో ఆ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయాయి. తాజా కంపెనీ ఐపీవోకు సంబంధించిన పత్రాలను మార్కెట్‌ రెగ్యూలేటర్‌ అయిన సెబీకి సమర్పించింది. ఈ ఐపీవో నుంచి లోధా డెవలపర్స్‌ రూ.2,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. కొన్నాళ్ల క్రితం కంపెనీ మాక్రోటెక్‌ డెవలపర్స్‌గా పేరు మార్చుకొన్న విషయం తెలిసిందే. తాజా ఐపీవోకు సంబంధించిన డీఆర్‌హెచ్‌పీని సెబీకి సమర్పించింది. 

గతంలో ఈ కంపెనీ 2009లో ఐపీవోకు ప్రయత్నించినా.. మార్కెట్‌ పరిస్థితులు బాగోక ప్రణాళికను ఉపసంహరించుకొంది. ఆ తర్వాత 2018లో మరో సారి ప్రయత్నించింది. అప్పుడు కూడా మార్కెట్‌ పరిస్థితుల కారణంగా ఈ ఆలోచన విరమించుకొంది. ఈ సారి ఐపీవో 10శాతం వాటా విక్రయించి రూ.2,500 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. 

ఇదీ చదవండి

ఒక్క మిస్డ్‌ కాల్‌తో `ఎస్‌బీఐ` వ్య‌క్తిగ‌త లోన్‌

1.2 బిలియన్‌ డాలర్లు ఇప్పించండి..!​​​​​​​

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని