close

తాజా వార్తలు

Published : 29/09/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేంకటేశుడే ఆ బ్యాంకు తొలి భాగస్వామి

చెన్నై: సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామే తమ తొలి షేర్‌ హోల్డర్‌ అని .. ఆయనే తమ బ్యాంకును కాపాడతాడని లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ప్రమోటర్లలో ఒకరైన కేఆర్‌ ప్రదీప్‌ ప్రకటించారు. ‘‘షేర్‌ హోల్డర్‌ నెంబర్‌ 1 స్థానం తమిళనాడు, కరూరు సమీపంలోని థంథోనిమలైలోని  ప్రముఖ దేవాలయంలో వెలసిన అరుల్‌మిగు  శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి పేరు మీద ఉంది.  ఆయన మా బ్యాంకును సదా  ఏ ఆపదా రానీయకుండా కాపాడతాడు. ’’ అని బ్యాంకు డైరక్టర్లలో ఒకరైన ప్రదీప్‌ అన్నారు . 1926లో విదేశీ బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా లక్ష్మీ విలాస్‌ బ్యాంకును స్థాపించారని ఆయన వివరించారు. కాగా ప్రస్తుతం దేశంలో 556 శాఖలతో పాటు విదేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

అయితే 94 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బ్యాంకు భారీ నష్టాలను చవిచూడటంతో దీనిని ప్రాంప్ట్‌ అండ్‌ కరెక్టవ్‌ యాక్షన్‌ (పీసీఆర్‌) పరిధిలోకి తెస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) 2019లో ప్రకటించింది. ఇక ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎంపిక గురించి ఇటీవల తలెత్తిన వివాదంతో బ్యాంకు మరిన్ని చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు ఆ ప్రాంతంలోని చిన్న వ్యాపారస్థుల అవసరాలకు సహాయకారిగా నిలిచిందని..  ఇటువంటి బ్యాంకులకు ఆటుపోట్లు మామూలేనని బ్యాంకు వర్గాలు తెలిపాయి. బ్యాంకులో తొలివాటాదారైన వేంకటేశ్వర స్వామే తమ సంస్థను సమస్యల బారి నుంచి కాపాడతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.