బ్యాంకుల‌కు క్యాపిట‌ల్ రిస్క్ త‌గ్గించిన ఆర్‌బీఐ - Low capital risk for bans
close

Published : 24/12/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల‌కు క్యాపిట‌ల్ రిస్క్ త‌గ్గించిన ఆర్‌బీఐ

డెట్ ఫండ్ పెట్టుబడిదారులకు ఇది సానుకూల అభివృద్ధి అని నిపుణులు అంటున్నారు

అభివృద్ధి, నియంత్రణ విధానాలపై రిజ‌ర్వ్ బ్యాంక్ విడుదల చేసిన‌ ప్రకటనలో డెట్‌ మ్యూచువల్ ఫండ్లు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటిఎఫ్) లలో పెట్టుబడులపై బ్యాంకులు కేటాయించాల్సిన రిస్క్ క్యాపిటల్‌ను త‌గ్గించింది. దీంతో ఈ ఫండ్ల‌లో ద్రవ్యతను మెరుగుపరుస్తుంది.

ప్రస్తుతం, డెట్ ఫండ్ల కోనుగోలుతో పోలిస్తే, డెట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు బ్యాంకులు ఎక్కువ మూలధనాన్ని కేటాయించాలి. ఎందుకంటే, డెట్‌ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు బ్యాంకుల మూలధన అవసరాలకు వచ్చినప్పుడు ఈక్విటీ ఫండ్లతో సమానంగా పరిగణిస్తారు. మరోవైపు, బ్యాంకులు నేరుగా డెట్ పేపర్లలో పెట్టుబడులు పెట్టినప్పుడు, మూలధన అవసరాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి , ఇవి క్రెడిట్ రేటింగ్, పెట్టుబడి ప‌థ‌కాల స్వభావం ఆధారంగా ఉంటాయి. డెట్‌ పెట్టుబ‌డుల‌ రెండు పద్ధతులను ఏకీకృతం చేయవలసిన అవసరం ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

ఏదేమైనా, డెట్ ఫండ్ల నుంచి ఒకేసారి ఉప‌సంహ‌ర‌ణ చేసుకునే ప్ర‌మాదం ఉంద‌ని గమనించిన సెంట్రల్ బ్యాంక్ పూర్తి సామరస్యానికి వెళ్ళలేదు. సాధారణ మార్కెట్ రిస్క్ ఛార్జ్ 9 శాతం య‌ధావిధిగా వ‌ర్తిస్తుంది.

డెట్ ఫండ్ పెట్టుబడిదారులకు దీని అర్థం ఏమిటి?
డెట్ ఫండ్ పెట్టుబడిదారుల దృక్కోణం నుంచి ఇది సానుకూల అభివృద్ధి అని నిపుణులు అంటున్నారు. బ్యాంకులు సాధారణంగా తమ మిగులు ద్రవ్యతను లిక్విడ్ ఫండ్ల‌ వంటి కొన్ని డెట్ ఫండ్ వర్గాలలో ఉంచుతాయి. ఈ చర్య లిక్విడ్ ఫండ్ల పెట్టుబ‌డుల‌ను, కార్పొరేట్ బాండ్ ఫండ్లను స్వల్పంగా మెరుగుపరుస్తుంది. ఇది ఒక‌ సంస్కరణ కంటే సౌక‌ర్యంగా చెప్పుకోవ‌చ్చ‌ని నిపుణులు భావిస్తున్నారు.

బ్యాంకులు తమ మిగులు నగదును లిక్విడ్ ఫండ్స్, ఇతర స్వల్పకాలిక ఫండ్లలో పెట్టుబడి పెడతాయి. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడంపై అధిక మూలధన ఛార్జ్ కారణంగా త్రైమాసికం ముగిసేలోపు నిధులను వెన‌క్కి తీసుకుంటాయి. అయితే ఇప్పుడు క్యాపిట‌ల్ ఛార్జీలు స‌మానంగా ఉండ‌టం వ‌ల‌న‌ బ్యాంకులు త్రైమాసిక ముగింపు స‌మ‌యంలో నిధులను తొలగించి, కొత్త త్రైమాసికంలో మొదటి రోజున తిరిగి పెట్టుబడులు పెట్టడానికి ఆశ్రయించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని