close

తాజా వార్తలు

భారత మార్కెట్లోకి ఎంజీ విద్యుత్‌ కారు

దిల్లీ: హెక్టర్‌ మోడల్‌తో భారత్‌లో ప్రవేశించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి భారత్‌ మార్కెట్లోకి వచ్చిన తొలి విద్యుత్తు ఎస్‌యూవీ ఇదే. రెండు వేరియంట్లలో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్సైట్‌ వేరియంట్‌ కారు ధర రూ.20.88లక్షలు కాగా.. ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ ధర రూ.23.58లక్షలుగా నిర్ణయించారు. ఈనెల 17తో ఈ కార్ల బుకింగ్స్‌ నిలిపివేశారు. అప్పటిలోపు బుక్‌ చేసుకున్న వారికి రూ.లక్ష తగ్గింపు ధరతో విక్రయించనున్నారు.

ప్రస్తుతం దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌లో మాత్రమే ఈ కారును విడుదల చేశారు. ఈ కారులో 44.5 కిలోవాట్స్‌ శక్తి ఉన్న బ్యాటరీని అందించారు. దీన్ని ఒకసారి రీఛార్జి చేస్తే 340 కిలోమీటర్లు వెళ్లే అవకాశం ఉంది. 40 నిమిషాల్లో 80శాతం ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. కేవలం ఎనిమిది క్షణాల్లో 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యం ఈ కారుకు ఉంది. ఆఫీస్‌, ఇంట్లో ఛార్జి చేసుకోవడానికి 7.4 కిలోవాట్ల హోం ఛార్జర్‌ను ఎంజీ అందజేస్తోంది. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.