close

Updated : 06/03/2021 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

`ఎంటీఏఆర్‌` టెక్నాల‌జీస్ ఐపీఓకు భారీ ఆద‌ర‌ణ‌

`ఎంటీఏఆర్‌` టెక్నాల‌జీస్ ఐపీఓ 200 రెట్లు ఓవ‌ర్ స‌బ్‌స్క్రైబ్‌ అయ్యింది.

మార్చి 3 న ప్రారంభ‌మైన‌ ప్రెసిష‌న్ ఇంజ‌నీరింగ్ సొల్యూష‌న్స్ కంపెనీ `ఎంటీఏఆర్‌` టెక్నాల‌జీస్  ఐపీఓ గురువారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 200.65 రెట్లు ఓవ‌ర్ స‌బ్‌స్క్రైబ్‌ అయ్యింది. ప్రారంభ వాటా అమ్మ‌కం కోసం ఈక్విటీ షేరుకు ప్రైస్ బ్యాండ్ రూ. 574-575 గా నిర్ణ‌యించారు. ఐపీఓ ముందు, ఎంటీఏఆర్ టెక్నాల‌జీస్ యాంక‌ర్ పెట్టుబ‌డిదారుల  నుంచి రూ. 179 కోట్లు వ‌సూలు చేసింది.

నోమురా, వైట్ ఓక్ కాపిట‌ల్, గోల్డ్‌మెన్ సాక్స్‌ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబ‌డిదారులు, ఇవి యాంక‌ర్ పుస్త‌కంలో వాటాల‌ను కేటాయించాయి. అద‌నంగా వాటాల‌ను కేటాయించిన దేశీయ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారుల‌లో ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియ‌ల్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఉన్నాయి.

`ఎంటీఏఆర్‌` టెక్నాల‌జీస్ ఐపీఓ గురించి తెలుసుకోవ‌ల‌సిన కొన్ని ముఖ్యాంశాలుః

కేఫిన్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ `ఎంటీఏఆర్‌` టెక్నాల‌జీస్ ఐపీఓ రిజిస్ట్రార్‌. వాటా కేటాయింపు మార్చి 10న ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది. మార్చి 16న లిస్టింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు తెలిపారు.

ప్ర‌స్తుత బుల్ మార్కెట్ సెంటిమెంట్స్, ప్ర‌త్యేక‌మైన వ్యాపారం, అధిక ఆప‌రేటింగ్‌, నిక‌ర మార్జిన్లు, ప్ర‌భుత్వ స‌హాయ‌క కార్య‌క్ర‌మాల కార‌ణంగా `ఎంటీఏఆర్‌` టెక్ ఐపీఓకు భారీ ఫ్యాన్సీ ధ‌ర ఉంది. లిస్టింగ్‌పై మార్కెట్ దాదాపు 70-80 శాతం లాభాల‌ను ఆశిస్తోంది అని ఐపీఓకు ముందు  జాబితా చేయ‌ని షేర్ల‌లో వ్య‌వ‌హ‌రించే అన్‌లిస్టెడ్ `అరేనా.కామ్‌` వ్య‌వ‌స్థాప‌కుడు గ్రే-మార్కెట్ ట్రాక‌ర్ అభ‌య్ దోషి తెలిపారు.

ఐపీఓలో రూ. 124 కోట్ల విలువ‌కు మొత్తం 21,48,149 షేర్లు ఉండ‌గా, రూ. 473 కోట్ల వ‌ర‌కు విలువైన 82,24,270 ఈక్విటీ షేర్ల‌కు ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ఉంది.

`ఎంటీఏఆర్‌` అనేది అణు, ర‌క్ష‌ణ, అంత‌రిక్ష‌, స్వ‌చ్ఛ‌మైన ఇంధ‌న రంగాల‌లో ఉనికిని క‌లిగి ఉన్న ఒక ఇంజ‌నీరింగ్ సొల్యూష‌న్స్ సంస్థ‌.  ఈ రంగాల‌లో పెరుగుతున్న డిమాండ్, పెరుగుతున్న పెట్టుబ‌డుల మ‌ద్ద‌తుతో, రాబోయే సంవ‌త్స‌రాల్లో ‌క‌చ్చిత‌మైన ఇంజ‌నీరింగ్ ఉత్ప‌త్తుల డిమాండ్ క్ర‌మంగా పెరుగుతుంద‌ని అంచ‌నా.

మొత్తం మీద కంపెనీకి రుణం నుంచి ఈక్విటీ నిష్ప‌త్తి 0.13 మాత్ర‌మే ఉన్న మంచి ఫైనాన్షియ‌ల్ ట్రాక్ రికార్డ్ ఉంది. త‌న‌కున్న టాప్ 3 క‌స్ట‌మ‌ర్ల నుండి 80 శాతానికి పైగా ఆదాయాన్ని పొందుతుంది.

జేఎమ్ ఫైనాన్షియ‌ల్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఇష్యూకు లీడ్ మేనేజ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

`ఎంటీఏఆర్‌` తాజా ఇష్యూ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని.. రుణాల‌ను తిరిగి చెల్లించ‌డానికి, దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న అవ‌స‌రాల‌కు ఈ నిధులను  ఉప‌యోగించాల‌ని యోచిస్తోంది.

`ఎంటీఏఆర్‌` ప్ర‌స్తుతం 7 ఉత్పాద‌క స‌దుపాయాల‌లో ప‌నిచేస్తుంది. వీటిలో హైద‌రాబాద్‌లో ఉన్న ఎగుమ‌తి-ఆధారిత యూనిట్ ఉంది. 4 ద‌శాబ్దాల‌కు పైగా ర‌క్ష‌ణ‌, ఏరోస్పేస్‌, ఇంధ‌న రంగాల‌కు సేవ‌లు అందిస్తోంది.

భార‌త్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్‌, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌, న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యుఎస్ ఆధారిత బ్లూమ్ ఎన‌ర్జీ కార్ప్ వంటి సంస్థ‌ల‌తో పాటు భార‌త్ డైన‌మిక్‌, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వంటి ఇత‌ర ప్ర‌సిద్ధ సంస్థ‌ల‌కు `ఎంటీఏఆర్‌` సేవ‌ల‌ను అందిస్తుంది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని