రక్షణ దళాలకు మహీంద్రా వాహనాలు - Mahindra Bags Order For 1300 Light Specialist Vehicles
close

Published : 23/03/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రక్షణ దళాలకు మహీంద్రా వాహనాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత రక్షణ దళాలకు దేశీయ ఆటోమొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్‌ లిమిటెడ్‌ వాహనాలను సరఫరా చేయనుంది. ఇది మహీంద్రా అండ్‌ మహీంద్రాకు అనుబంధ సంస్థ. మొత్తం 1300 లైట్‌ స్పెషలిస్టు వెహికల్స్‌ను దళాలకు సరఫరా చేయనుంది. దళాలను, ఆయుధాలను తరలించడానికి ఈ వాహనాలను ఉపయోగించనున్నారు. ఈ డీల్‌ విలువ రూ.1,056 కోట్లు. వచ్చే నాలుగేళ్లలో ఎండీఎస్‌ సంస్థ ఈ వాహనాలను సరఫరా చేయనుంది.

ఈ విషయాన్ని మహీంద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ఎస్‌పీ శుక్లా వెల్లడించారు. ‘‘ఈ కాంట్రాక్టు ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమ విజయానికి మైలురాయిగా ఉంటుంది. ప్రైవేటు రంగంలో డిజైన్‌ చేసి తయారు చేసిన వాహనానికి లభించిన తొలి పెద్ద కాంట్రాక్టు ఇదే. భారత్‌లో తయారైన పరికరాల వినియోగానికి ఇది బాటలు పరుస్తుంది’’ అని పేర్కొన్నారు.

భారత సైనికదళాల ప్రమాణాలకు అనుగుణంగా ఎండీఎస్‌ సంస్థ ఈ వాహనాన్ని అభివృద్ధి చేసింది. దీనికి సంస్థ జీవితకాలం సర్వీస్‌ కూడా అందించనుంది. దీనిని పూర్తిగా ఎండీఎస్‌ అభివృద్ధి చేసింది. ఈ వాహనం కొనుగోలుకు ముందు సైన్యం దీనిపై అన్ని రకాల పరీక్షలు నిర్వహించింది. వివిధ రకల భౌగోళిక పరిస్థితుల్లో ఈ వాహనాన్ని వినియోగించింది. పేలుడు తట్టుకొనే శక్తిని పరిశీలించింది. ఎల్‌ఎస్‌వీల్లో ఒక వేరియంట్‌ను ఇప్పటికే సైన్యం వినియోగిస్తోంది.

ఇవీ చదవండి

మారటోరియం కాలాన్ని పొడిగించలేం
తయారీ రంగం కోలుకుంటోంది


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని