close

Updated : 13/04/2021 12:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎక్స్‌యూవీ 700కు రంగం సిద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎక్స్‌యూవీ700గా వ్యవహరిస్తున్న  కారును ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ సరికొత్త డబ్ల్యూ601 ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేశారు.  దీనిని ప్రస్తుతం ఉన్న ఫ్లాగ్‌షిప్‌ కారు ఎక్స్‌యూవీ 500తో భర్తీ చేస్తారని భావిస్తున్నారు. దీనిపై మహీంద్రా ప్రతినిధి స్పందిస్తూ ‘‘మేము ఎక్స్‌యూవీ 700ను విడుదల చేశాక.. ఎక్స్‌యూవీ 500 తయారీ నిలిపివేస్తాం’ అని పేర్కొన్నట్లు ఎన్‌డీటీవీ వెల్లడించింది. మహీంద్రా ఎక్స్‌యూ 500 బ్రాండ్‌ను పూర్తిగా నిలిపివేసే అవకాశాలు లేకపోవచ్చు. భవిష్యత్తులో వచ్చే కార్లకు దీనిని వాడవచ్చు.

చిరుతను స్ఫూర్తిగా తీసుకొని 2011లో ఎక్స్‌యూవీ 500ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అప్పట్లో రూ.15లక్షల్లోపు ప్రీమియం కార్ల విభాగంలో ఇది బంపర్‌ విజయం సాధించింది. ఆ తర్వాత మార్కెట్లోకి క్రెటా, సెల్టోస్‌,జీప్‌ కంపాస్‌ రావడంతో దీనికి పోటీ పెరిగిపోయింది.

ఇక మార్కెట్లోకి తీసుకురానున్న సరికొత్త ఎక్స్‌యూవీ 700లో ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలు మహీంద్రా అందుబాటులోకి తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఆల్‌వీల్‌ డ్రైవింగ్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్స్‌,అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌, 6 ఎయిర్బ్యాగ్స్‌, ఏబీఎస్‌, ఈబీడీ, 4డిస్క్‌బ్రేక్‌లు వంటివి ఉండే అవకాశం ఉంది. విలాసవంతమైన కార్లలో వినియోగించే భారీ సింగల్‌ స్క్రీన్‌ కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిలోనే ఇన్ఫోటైన్‌మెంట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉండనున్నాయి. అంతేకాదు.. లుక్స్‌ను  మరింత ప్రీమియంగా మార్చారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని