close
Array ( ) 1

తాజా వార్తలు

మహీంద్రా కారుకు‘సేఫ్‌ ఛాయిస్‌’ అవార్డు

ముంబయి: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా నుంచి ఇటీవల విడుదలైన ఎక్స్‌యూవీ 300 కారు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కారును అత్యద్భుతమైన భద్రతా ప్రమాణాలతో రూపొందించారని పేర్కొంటూ.. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌(కొత్త కార్ల అసెస్మెంట్‌ ప్రొగ్రామ్‌) ‘సేఫర్‌ ఛాయిస్‌’ అవార్డు ప్రకటించింది. ఇప్పటికే గత నెలలో ఎక్స్‌యూవీ 300 అడల్ట్‌, చైల్డ్‌ ఆక్యూపెంట్‌ ప్రొటెక్షన్‌ విషయంలో ఎన్‌క్యాప్‌ నుంచి 5, 4 స్టార్‌ రేటింగ్‌ పొంది అవార్డుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఎన్‌క్యాప్‌ సీఈవో డేవిడ్‌ వర్డ్‌ మాట్లాడుతూ.. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 300 అని తెలిపారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటించడంలో ఈ కారు అర్హత సాధించిందన్నారు. మహీంద్రా సంస్థకు ఇదో చరిత్రాత్మక సమయమన్నారు. ఈ అవార్డును పరిచయం చేశాక భారత ఆటోమొబైల్‌ పరిశ్రమలు భద్రతా ప్రమాణాల దిశగా ముందుకెళ్లడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. 

కార్ల భద్రతకు సంబంధించిన ప్రమాణాల విషయమై అవార్డులు, రేటింగ్‌ కోసం గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ పనిచేస్తోంది. కార్ల తయారీలో పాదాచారుల భద్రత, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ వంటి భద్రతా ప్రమాణాల ఆధారంగా వారు ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
besttaxfiler
Saket Pranamam
VITEEE 2020
dr madhu
HITS2020

Panch Pataka

దేవతార్చన