Mahindra: మహీంద్రా సరికొత్త బొలెరో నియో - Mahindra bolero neo launched
close

Published : 14/07/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mahindra: మహీంద్రా సరికొత్త బొలెరో నియో

ధర రూ.8.48 లక్షల నుంచి

దిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా ఏడు సీట్ల మోడల్‌ బొలెరో నియోను విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. ఎస్‌యూవీ కోసం చూస్తున్న వినియోగదారుల అవసరాలను కొత్త బొలెరో తీరుస్తుందని, అధునాతన లుక్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బొలెరో నియోతో పాటు ప్రస్తుత బొలెరో మోడల్‌ అమ్మకాలను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అగ్రగామి 10 ఎస్‌యూవీల్లో బొలెరో స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త నియో దోహదపడుతుందని కంపెనీ సీఈఓ ఆటోమోటివ్‌ విభాగం వీజే నక్రా ఆశాభావం వ్యక్తం చేశారు. డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, కార్నరింగ్‌ బ్రేక్‌ కంట్రోల్, ఐసోఫిక్స్‌ ఛైల్డ్‌ సీట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో అమర్చిన మహీంద్రా ఎంహాక్‌ ఇంజిన్‌ 100 హెచ్‌పీ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని