ధరలపై మహీంద్రా దృష్టి - Mahindra focuses on prices
close

Published : 10/05/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధరలపై మహీంద్రా దృష్టి

దిల్లీ: ఉక్కు సహా పలు కమొడిటీ ధరలు ఇటీవల భారీగా పెరగడంతో, తీసుకోవాల్సిన చర్యలపై దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా దృష్టి పెట్టింది. కొన్ని రోజుల్లోనే హాట్‌ రోల్డ్‌ కాయిల్‌, కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ ధరలను దేశీయ ఉక్కు సంస్థలు వరుసగా టన్నుకు రూ.4000, రూ.4,500 చొప్పున పెంచాయి. ధరల సవరణ తర్వాత టన్ను హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ ధర రూ.67,000, టన్ను కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ ధర రూ.80000కు చేరాయి. మే మధ్యలో లేదా జూన్‌ ప్రారంభంలో వీటి ధరలు టన్నుకు మరో రూ.2000- 4000 వరకు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ముడివస్తువుల ధరలు పెరగడంతో టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ వంటి సంస్థలు ఇప్పటికే కార్ల ధరలను పెంచాయి. ఏప్రిల్‌లోనే కార్ల ధరలను పెంచామని, ఇప్పుడు ముడివస్తువుల ధరలు పెరగడంతో వ్యయాల నిర్వహణ సహా ఇతర అవకాశాలపై దృష్టి పెట్టామని మహీంద్రా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆటోమోటివ్‌ విభాగం) వీజే నక్రా వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని