
తాజా వార్తలు
దిల్లీ: దేశంలోని ఉత్పాక రంగం నవంబర్లో కొంత పుంజుకొంది. కానీ, కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి మందకొడిగానే ఉన్నాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానిఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ నవంబర్ నెలలో స్వల్ప వృద్ధితో 51.2గా నమోదైంది. ఇదే సూచీ అక్టోబర్లో 50.6గా ఉంది. ఇప్పటికే ఈ సూచీ రెండేళ్ల కనిష్ఠాన్ని తాకింది. కానీ తాజా పెరుగుదల ఉత్పాదక రంగం స్వల్పంగా కోలుకున్నట్లు తెలియజేస్తోంది.
‘‘అక్టోబర్లో బాగా నెమ్మదించిన ఉత్పాదక రంగం నవంబర్లో కోలుకున్నట్లు కనిపిస్తోంది. ఇది స్వాగతించాల్సిన అంశం. ఫ్యాక్టరీలకు ఆర్డర్లు విస్తృతం కావాల్సి ఉంది. 2019 ప్రారంభంలో ఉన్న ఉత్పత్తి, ఎగుమతుల రేటును అందుకోవడానికి చాలా దూరంలో ఉన్నాము. ముఖ్యంగా డిమాండ్ తగ్గడం వీటిపై ప్రభావం చూపింది. పీఎంఐ డేటా ప్రకారం ద్రవ్యోల్బణ ఒత్తిడి లేకపోవడంతో ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లు తగ్గించడంతో పాటు ‘అకామడేటివ్’ పాలసీ విధానాన్ని కొనసాగించవచ్చు’’ అని ఐహెచ్ఎస్ మార్కిట్ చీఫ్ ఎకానమిస్ట్ పొలియాన్న డి లిమా వెల్లడించారు.
ఆర్బీఐ బాధ్యతలను శక్తికాంత్ దాస్ చేపట్టినప్పటి నుంచి ప్రతి పరపతి విధాన సమీక్షలోను వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్నారు. 2019లో మొత్తం ఐదు సార్లు వడ్డీరేట్లను తగ్గించారు. ఫలితంగా వడ్డీరేట్లు మొత్తం 135 బేసిస్ పాయింట్లు తగ్గాయి. దీంతోపాటు వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచే ప్రయత్నాలను కూడా ఆర్బీఐ చేస్తోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
