తయారీ కార్యకలాపాల్లో స్తబ్ధత! - Manufacturing activities in april stagnant
close

Published : 03/05/2021 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తయారీ కార్యకలాపాల్లో స్తబ్ధత!

దిల్లీ: దేశీయ తయారీ రంగ కార్యకలాపాలు ఏప్రిల్‌లో స్తబ్దుగా నడిచాయి. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి కార్యకలాపాలు ఎనిమిది నెలల కనిష్ఠానికి చేరాయి. ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ నెలవారీ సర్వే ప్రకారం.. మార్చిలో 55.4గా ఉన్న మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ(పీఎంఐ) గత నెల 55.5గా నమోదైంది. అయితే, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న 53.6 సగటు కంటే ఇది ఎక్కువే ఉండడం గమనార్హం. పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు.. అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.

కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి మరింత తగ్గుముఖం పట్టినట్లు ఏప్రిల్‌ పీఎంఐ సూచీ తెలియజేస్తోందని ఐహెచ్‌ఎస్‌ మార్కెట్‌‌ ప్రతినిధి లిమా తెలిపారు. కొవిడ్‌ కేసులు ఇంకా భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో గిరాకీపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడిందని తెలిపారు. ఇక ఉద్యోగ కల్పనపై కొవిడ్‌ ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని వెల్లడించారు. అలాగే నిర్వహణ, ముడిపదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయని.. దీని ప్రభావం విక్రయ ధరలపైనా ఉండే అవకాశం ఉందన్నారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పుంజుకోవడం విశేషం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని