8 నెలల కనిష్ఠానికి తయారీ - Manufacturing pmi at 8 month low
close

Published : 04/05/2021 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

8 నెలల కనిష్ఠానికి తయారీ

దిల్లీ: ఏప్రిల్‌ నెలలో భారత తయారీ రంగ కార్యకలాపాల వృద్ధిలో పెద్దగా మార్పు కనిపించలేదు. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి విషయంలో వృద్ధి లేకపోవడంతో ఎనిమిది నెలల కనిష్ఠానికి చేరినట్లు నెలవారీ సర్వే వివరాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎమ్‌ఐ) 55.5గా నిలిచింది. మార్చిలో ఇది 55.4గా ఉంది. పీఎమ్‌ఐ అనేది 50కి పైన ఉంటే వృద్ధిగా.. దిగువకు చేరితే క్షీణతగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే డీలా పడిన కంపెనీల ఆర్థిక ఫలితాలపై.. క్షీణిస్తున్న గిరాకీ మరింత ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా, కొత్త ఎగుమతి ఆర్డర్లు మాత్రం వరుసగా ఎనిమిదో నెలా పెరగడం విశేషం. భారత వస్తువులకు అంతర్జాతీయంగా గిరాకీ పుంజుకోవడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని