close

Updated : 26/02/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్ని చవిచూస్తుండడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్‌ 50,256 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 14,888 వద్ద ఆరంభమైంది. ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్‌ 792 పాయింట్ల నష్టంతో 50,260 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 214 పాయింట్లు దిగజారి 14,883 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.01 వద్ద కొనసాగుతోంది. బ్యాంకిగ్‌, ఆర్థిక, ఐటీ, స్థిరాస్తి రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండడం సూచీల సెంటిమెంటును మరింత దిగజార్చింది. బీఎస్‌ఈ టాప్‌ 30 కంపెనీల్లో 29 నష్టాల్లోనే ట్రేడవుతుండడం గమనార్హం. బాండ్‌ ఈల్డులు పెరగడం, కమొడిటీల ధరలు ఎగబాకడం మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గురువారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. బాండ్‌ ఈల్డులు పెరగడం, టెక్‌ కంపెనీల షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడం అక్కడి మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. 

టెలికాం, విద్యుత్తు, లోహ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు మినహా మిగతా రంగాల షేర్లన్నీ నష్టాల్లోనే పయనిస్తున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.
 

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని