స్టాక్ మార్కెట్‌: ఆద్యంతం ఒడుదొడుకులమయం - Markets are in Deep volatile
close

Published : 09/04/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్ మార్కెట్‌: ఆద్యంతం ఒడుదొడుకులమయం

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఆద్యంతం ఊగిసలాటలో పయనించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాభాల్లోకి చేరుకొని ఇంట్రాడే గరిష్ఠాల్ని తాకాయి. మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో కిందకు దిగజారాయి. కరోనా కలవరంలో కొట్టుమిట్టాడుతున్న సూచీలకు దేశీయంగా బలాన్నిచ్చే అంశాలు కరవయ్యాయి. దీంతో నేటి సూచీల ప్రయాణం ఆద్యంతం ఒడుదొడుకులమయంగా సాగింది. ఉదయం 49,743 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సూచీ 49,906 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 49,461 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 154 పాయింట్ల నష్టంతో 49,591 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే.. 14,882 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 14,918-14,785 మధ్య కదలాడింది. చివరకు 38 పాయింట్లు కోల్పోయి 14,834 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.75 వద్ద ముగిసింది. 

నిఫ్టీ నమోదిత రంగాల్లో లోహ, సీపీఎస్‌ఈ, ఇంధన, బ్యాంకింగ్‌ రంగ సూచీలు నష్టాలు మూటగట్టుకోగా.. హెల్త్‌కేర్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, టెక్‌ రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి. సిప్లా, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, విప్రో లిమిటెడ్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, యూపీఎల్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని