close

Published : 02/03/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొనసాగుతున్న లాభాల జోరు..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సోమవారం నాటి లాభాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం సెన్సెక్స్‌ 50,258 వద్ద, నిఫ్టీ 14,865 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 404 పాయింట్లు ఎగబాకి 50,254 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 14,881 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.47గా ఉంది.

 ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో పయనిస్తున్నాయి. జపాన్‌ మార్కెట్ల సూచీ నిక్కీ 0.4 శాతం, హాంకాంగ్‌ మార్కెట్‌ సూచీ హాంగ్‌ సెంగ్‌ 0.7 శాతం, షాంఘై కాంపోజిట్‌ 0.8 శాతం నష్టాల్లో పయనిస్తున్నాయి. ఇక సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉద్దీపన పథకం, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా వార్తలు అక్కడి మార్కెట్లను ముందుకు నడిపించాయి. ఇక దేశీయంగా సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.125 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ మదుపర్లు రూ.195 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ పరిణామాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. కీలక రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తుండడం మార్కెట్లకు దన్నుగా నిలుస్తోంది.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. భారత్‌ పెట్రోలియం, ఐవోసీఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని