లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Markets are in Green
close

Published : 10/03/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 51,404 వద్ద, నిఫ్టీ 15,202 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:42 గంటల సమయానికి సెన్సెక్స్‌ 277 పాయింట్లు ఎగబాకి 51,325 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 15,182 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.94 వద్ద కొనసాగుతోంది.  

మంగళవారం అమెరికా సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. 1.9 బిలియన్‌ డాలర్ల కరోనా ఉద్దీపన పథకం ఆమోదం దిశగా పురోగతి, టెక్‌ షేర్ల దూకుడు అక్కడి మార్కెట్లను ముందుకు నడిపించాయి. బాండ్ల రాబడుల పెరుగుదలలో స్థిరత్వం నెలకొనడం కూడా సూచీలకు కలిసొచ్చింది. దీంతో మంగళవారం డోజోన్స్‌ 0.10శాతం, ఎస్‌అండ్‌పీ500 1.42 శాతం, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 3.69 శాతం ఎగిశాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతుండడం, అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ నేపథ్యంలో ప్రపంచ జీడీపీ అంచనాల్ని ఓఈసీడీ 1.4 శాతం పెంచించింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.6 శాతం మేర పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, విప్రో లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని