కోలుకున్న మార్కెట్లు - Markets are in Green
close

Published : 16/03/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోలుకున్న మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నిన్నటి(సోమవారం) భారీ ఒడుదొడుకుల నుంచి కోలుకున్నాయి. మంగళవారం సెన్సెక్స్‌ 50,608, వద్ద, నిఫ్టీ 14,996 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్‌ 295 పాయింట్లు లాభపడి 50,690 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 75 పాయింట్లు ఎగబాకి 15,005 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.49 వద్ద కొనసాగుతోంది.

రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో పాటు కీలక రంగాల్లో షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం సూచీలు భారీ ఒడుదొడుకులకు లోనైన విషయం తెలిసిందే. దీంతో నేడు మార్కెట్లు స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. మరోవైపు సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దీంతో ఆసియా మార్కెట్లు సైతం నేడు లాభాల్లో పయనిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

లోహ, బ్యాంక్‌ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటాన్‌ కంపెనీ, యూపీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ లిమిటెడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని