భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - Markets are in deep red
close

Updated : 19/03/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఐదు రోజుల నుంచి నష్టాల్లో పయనిస్తున్న సూచీలు నేడూ అదే పరంపరను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్‌  48,881, వద్ద, నిఫ్టీ 14,471 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:32 గంటల సమయానికి సెన్సెక్స్‌ 536 పాయింట్లు నష్టపోయి 48,667 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 182 పాయింట్లు దిగజారి 14,369 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.63 వద్ద కొనసాగుతోంది.  

అమెరికా మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. బాండ్ల ప్రతిఫలాలు పెరగడం, ఐరోపాలో మరోసారి కరోనా కేసులు పెరగడం అక్కడి సూచీలను దెబ్బతీస్తున్నాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో పయనిస్తున్నాయి.  

దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.  కొటాక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని