లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Markets are in green
close

Updated : 07/04/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బుధవారం సెన్సెక్స్‌ 49,277 వద్ద, నిఫ్టీ 14,716 వద్ద లాభాల్లో ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:39 గంటల సమయానికి సెన్సెక్స్‌ 169 పాయింట్లు లాభపడి 49,370 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 62 పాయింట్లు దిగజారి 14,745 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.53 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ ఉదయం సానుకూల సంకేతాలను సూచించింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. అలాగే 2021లో భారత జీడీపీ 12.5 శాతంగా ఉండొచ్చన్న ఐఎంఎఫ్‌ అంచనాలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి. ఇక దేశీయంగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై మదుపర్లు అప్రమత్తంగానే ఉన్నారు. అలాగే ఈ వారం విడదల కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించారు. 

నిఫ్టీ నమోదిత సూచీల్లో దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అదానీ పోర్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా కన్సూమర్‌ ప్రోడక్ట్స్‌, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్ ఫినాన్స్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని