భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Markets are in green
close

Updated : 20/04/2021 09:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 472 పాయింట్లు లాభపడి 48,421 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 149 పాయింట్లు ఎగబాకి 14,508 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.58 వద్ద కొనసాగుతోంది.

సోమవారం భారీ నష్టాలు మూటగట్టుకున్న మార్కెట్లు నేడు స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కరోనా కట్టడి దిశగా కేంద్రం పలు కీలక చర్యలు చేపట్టడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. కరోనా కట్టడిలో కీలకంగా భావిస్తున్న వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే దిశగా కేంద్ర సోమవారం పలు నిర్ణయాలు ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలను నేరుగా తయారీ సంస్థల వద్దే కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి.

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా... హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని