నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - Markets are in red
close

Updated : 22/03/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. గతవారం తీవ్ర ఒడుదొడుకుల్లో పయనించిన సూచీలు ఈ వారమూ అదే బాటలో పయనించే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం సెన్సెక్స్‌ 49,878 వద్ద, నిఫ్టీ 14,736 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:38 గంటల సమయానికి సెన్సెక్స్‌ 159 పాయింట్లు నష్టపోయి 49,709 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 25 పాయింట్లు కుంగి 14,719 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.48 వద్ద కొనసాగుతోంది.  

అమెరికా మార్కెట్లు గతవారాన్ని మిశ్రమంగా ముగించాయి. అయితే, ఆసియా మార్కెట్లు మాత్రం అప్రమత్తంగా కదలాడుతున్నాయి. బాండ్ల ప్రతిఫలాలు స్థిరపడడం, ఐరోపా దేశాలతో పాటు దేశీయంగానూ మరోసారి కరోనా కేసులు పెరగడం సూచీలను ప్రభావితం చేయనున్నాయి. కీలక బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లోని షేర్లు డీలా పడడం సూచీల సెంటిమెంటును దెబ్బతీస్తోంది. 

స్థిరాస్తి, విద్యుత్తు, హెల్త్‌కేర్‌, ఆటో రంగ సూచీలు లాభాల్లో పయనిస్తుండగా.. బ్యాంకింగ్‌, ఇంధన, లోహ, ఆర్థిక రంగ సూచీలు నష్టాలు చవిచూస్తున్నాయి. సిప్లా, భారత్‌ పెట్రోలియం, దివీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, బ్రిటానియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని