భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - Markets are in red
close

Updated : 05/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 50,020 వద్ద, నిఫ్టీ 14,837 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:43 గంటల సమయానికి సెన్సెక్స్‌ 403 పాయింట్లు నష్టపోయి 49,626 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 93 పాయింట్లు దిగజారి 14,773 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.37 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు గతవారం లాభాలతో ముగిశాయి. అలాగే మార్చిలో అక్కడ నిరుద్యోగం భారీ స్థాయిలో పడిపోయిందన్న వార్తలు సానుకూలాంశం. దీంతో అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ఒక్క హాంకాంగ్‌ మినహా అన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ ఉదయం నష్టాల్లో ట్రేడయింది. ఇక దేశీయంగా కొవిడ్‌ విజృంభణ భారీ స్థాయిలో కొనసాగుతోంది. దీంతో మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగానూ ఆయా రాష్ట్రాల్లో తీవ్రతను బట్టి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈవారం విడుదల కానున్న ఆర్‌బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఏడు మినహా అన్ని కంపెనీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఇన్ఫీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్‌ ఫినాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని