పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు - Markets are moving in volatality
close

Published : 23/02/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుంజుకున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 50,104 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 14,782 వద్ద ఆరంభమైంది. మంగళవారం ఉదయం 9:38 గంటల సమయానికి సెన్సెక్స్‌ 131 పాయింట్లు లాభపడి 49,876 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్లు ఎగబాకి 14,718 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. అమెరికా బాండ్ల మార్కెట్లో నెలకొన్న అస్థిరతతో ద్రవ్యోల్బణ భయాలు పెరగడం ఆసియా సూచీలపై ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ.. నిన్నటి భారీ పతనం నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడంతో సూచీలకు బలం చేకూరింది.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, స్థిరాస్తి రంగాల సూచీలు రెండు శాతానికి పైగా లాభాల్లో పయనిస్తున్నాయి. ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, గెయిల్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యూపీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, మారుతీ సుజుకీ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని