బుల్‌ జోరు.. కొత్త శిఖరాల్లో మార్కెట్లు - Markets at fresh highs Sensex rallies 359 pts Nifty near 14900
close

Updated : 04/02/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్‌ జోరు.. కొత్త శిఖరాల్లో మార్కెట్లు

ముంబయి: బడ్జెట్‌ ఇచ్చిన బూస్ట్‌తో బుల్‌ దూసుకెళ్తోంది. సరికొత్త శిఖరాల వైపు పరుగులు తీస్తోంది. బ్యాంకింగ్‌, లోహ రంగ షేర్ల అండతో వరుసగా నాలుగో రోజు దేశీయ మార్కెట్లో లాభాల పంట పండింది. దీంతో సెన్సెక్స్‌ సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. నిఫ్టీ 14,800 పైన స్థిరపడింది. 

నష్టాలను అధిగమించి..

ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలు, అమ్మకాల ఒత్తిడితో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 50,212.25 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఆరంభంలో ఆరంభంలో చాలా సేపు ఒడుదొడుకులకు లోనైంది. ఒక దశలో 49,926 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయితే మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల షేర్లలో మళ్లీ కొనుగోళ్లు జరగడంతో కుదురుకున్న సూచీ లాభాల్లో పయనించింది. ఇంట్రాడేలో 50,687.51 వద్ద గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ.. చివరకు 358.54 పాయింట్ల లాభంతో 50,614.29 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలో ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 105.70 పాయింట్లు ఎగబాకి 14,895.70 వద్ద కొత్త రికార్డు వద్ద స్థిరపడింది. 

ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నిఫ్టీలో ఐటీసీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు రాణించగా.. ఏషియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌, సిప్లా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటామోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. 

ఇవీ చదవండి..

వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర

ఎస్‌బీఐ నికరలాభం తగ్గింది..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని