Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు - Markets build on gains amid firm global cues
close

Published : 26/10/2021 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. కార్పొరేట్‌ సంస్థల ఆశాజనక ఫలితాల నేపథ్యంలో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. దీనికితోడు అంతర్జాతీయ పరిణామాలు సైతం సానుకూలంగా ఉండటం కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 383 పాయింట్లు లాభపడి, 61,350 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ సైతం 143 పాయింట్ల లాభంతో 18,268 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టైటాన్‌ కంపెనీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తదితర షేర్లు లాభపడగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌యూఎల్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని