షట్‌డౌన్‌ను పొడిగించిన మారుతీ సుజుకీ - Maruti Suzuki India Extends Maintenance Shutdown Till May 16
close

Published : 09/05/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షట్‌డౌన్‌ను పొడిగించిన మారుతీ సుజుకీ

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ మెయింటనెన్స్‌ షట్‌డౌన్‌ను పొడిగించింది. గత నెలలో మే1 నుంచి 9వ తేదీ వరకు షట్‌డౌన్‌ ఉంటుందని వెల్లడించిన మారుతీ.. ఇప్పుడు దానిని మే 16వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి దాఖలు చేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ గుజరాత్‌ ప్లాంట్‌ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొంది.

భారత్‌లో కొవిడ్‌ పరిస్థితి నానాటికీ తీవ్రంగా మారిపోవడం, చాలా చోట్ల లాక్‌డౌన్‌లు విధించడంతో డిమాండ్‌ తగ్గింది. దీనికి తోడు ఆక్సిజన్‌ ఉత్పత్తిపై మారుతీ దృష్టిపెట్టడం కూడా ఒక కారణం.  భారత ప్రభుత్వం ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సంస్థలను.. పరిశ్రమల ఆక్సిజన్‌ వినియోగం తగ్గించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం దానిని వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారు. ఏప్రిల్‌లో మారుతీ సుజుకీ మొత్తం 1,59,955 వాహనాలను ఉత్పత్తి చేసింది. మార్చి నెల(1,72,433)తో పోలిస్తే ఇది 7శాతం తక్కువ. కొవిడ్‌ లాక్‌డౌన్లతో  ఉత్పత్తి తగ్గినట్లు మారుతీ తన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని