మరోసారి ధరలు పెంచిన మారుతీ - Maruti Suzuki hikes model prices
close

Published : 16/04/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి ధరలు పెంచిన మారుతీ

దిల్లీ‌: తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరల్ని పెంచుతున్నామని ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ శుక్రవారం ప్రకటించింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఎక్స్‌షోరూం ధరల్ని దాదాపు 1.6 శాతం మేర పెంచినట్లు పేర్కొంది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు ఎగబాకడమే ధరల పెంపునకు కారణమని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. మోడల్‌ని బట్టి ఒక్కో కారుపై అత్యధికంగా రూ.22,500 వరకు పెంచినట్లు తెలిపింది. స్విఫ్ట్‌, సెలెరియో మినహా దాదాపు అన్ని మోడళ్లపై ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఈ కేలండర్‌ సంవత్సరంలో మారుతీ ధరలు పెంచడం ఇది రెండోసారి. జనవరి 18న గరిష్ఠంగా కొన్ని మోడళ్లపై రూ.34,000 వరకు ధరలు పెరిగిన విషయం తెలిసిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని