close

తాజా వార్తలు

మారుతీ.. 5లక్షల బీఎస్‌6 వాహనాల విక్రయం

దిల్లీ: కాలుష్య నివారణపై చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-6 ఇంజిన్‌ ఉన్న వాహనాలను మాత్రమే విక్రయించేలా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే తాము 5 లక్షల యూనిట్ల బీఎస్‌-6 వాహనాలను విక్రయించినట్లు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్రస్తుతం బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌తో 10 మోడళ్లను విక్రయిస్తున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ సందర్భంగా మారుతీ సుజుకీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో కేనిచి అయుకవా మాట్లాడుతూ.. ఈ విజయం భారత్‌లో కొత్త ఇంజిన్లు, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధిని చాటిచెబుతోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తమ కంపెనీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. అందరికంటే ముందుగానే తమ పాపులర్‌ మోడళ్లలో  బీఎస్‌-6 ఇంజిన్లను ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. 

కొత్త నిబంధనలు అమలు చేయడానికి ప్రభుత్వం కల్పించిన గడువుకు సరిగ్గా ఏడాది ముందే 2019 ఏప్రిల్‌లో మారుతీ తొలి బీఎస్‌-6 ఇంజిన్‌ పెట్రోల్‌ కారును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆల్టో, ఎకో, ఎస్‌-ప్రెసో, సెలెరియో, వేగనార్‌, స్విఫ్ట్‌, బాలెనో, డిజైర్‌, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 మోడళ్లను బీఎస్‌-6 ఇంజిన్లతో విక్రయిస్తోంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.