Maruti: జులై నుంచి పెరగనున్న మారుతీ ధరలు! - Maruti announced price hike
close

Published : 21/06/2021 22:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maruti: జులై నుంచి పెరగనున్న మారుతీ ధరలు!

దిల్లీ‌: తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరల్ని పెంచనున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సోమవారం ప్రకటించింది. ఈ ధరలు ఈ ఏడాది రెండో త్రైమాసికం ప్రారంభం అంటే వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అయితే, ధరలు ఎంతమేర పెరగనున్నాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు ఎగబాకడమే ధరల పెంపునకు కారణమని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. మోడల్‌ని బట్టి ధరల పెంపు మారుతుందని తెలిపింది. ఈ క్యాలండర్‌ సంవత్సరంలో మారుతీ ధరలు పెంచడం ఇది మూడోసారి. జనవరి 18న గరిష్ఠంగా కొన్ని మోడళ్లపై రూ.34,000 వరకు, ఏప్రిల్‌లో ఎక్స్‌షోరూం ధరలపై 1.6 శాతం పెంపు అమలు చేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని