Q4 Results:అంచనాల్ని అందుకోలేకపోయిన మారుతీ! - Maruti suzuki q4 profits declines
close

Published : 27/04/2021 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Q4 Results:అంచనాల్ని అందుకోలేకపోయిన మారుతీ!

నాలుగో త్రైమాసికంలో లాభాల్లో 9.7% క్షీణత

దిల్లీ: దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా కన్సాలిడేటెడ్‌ లాభం మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 9.7 శాతం క్షీణించి రూ.1,166.1 కోట్లుగా నమోదైంది. వ్యయభారం పెరగడంతో పాటు అమ్మకాలు తగ్గడం లాభాల క్షీణతకు దారి తీసిందని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,291.7 కోట్లు.

ఏడాది ప్రాతిపదికన నాలుగో త్రైమాసికంలో అమ్మకాలు 27.8 శాతం పెరిగి 4,92,235 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. దేశీయ విపణిలో విక్రయాలు 26.7 శాతం వృద్ధి చెంది 4,56,707 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 44.4 శాతం ఎగబాకి 35,528 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఇక ఎబిటా(EBITDA) ఆదాయం ఏడాది ప్రాతిపదికన 28.8 శాతం పెరిగి రూ.1991.4 కోట్లుగా నమోదైంది. అయితే, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఎబిటా ఆదాయం 10.56 శాతం క్షీణించింది.

ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తంలో మారుతీ విక్రయాలు 6.7 శాతం క్షీణించి 14,57,861 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయ మార్కెట్లో విక్రయాలు 6.8 శాతం తగ్గి 1,361,722 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఎగుమతుల్లో 5.9 శాతం క్షీణత నమోదైంది. ఆదాయం 7.2 శాతం తగ్గి రూ. 66,562.1 కోట్లుగా నమోదైంది. మహమ్మారి మూలంగా నికర లాభం 25.1 శాతం కుంగి 4,229.7 కోట్లుగా రికార్డయింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని