భారీగా పెరిగిన పసిడి దిగుమతులు - Massively increased gold imports
close

Published : 26/07/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీగా పెరిగిన పసిడి దిగుమతులు

దిల్లీ: ఏప్రిల్‌-జూన్‌ 2021 త్రైమాసికంలో దేశ పసిడి దిగుమతులు పదింతలకు పైగా పెరిగి 7.9 బిలియన్‌ డాలర్ల(రూ.58,572.99 కోట్లు)కు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఇవి 688 మిలియన్‌ డాలర్లు(రూ.5208.41 కోట్లు)గానే ఉన్నాయి. వెండి దిగుమతులు మాత్రం 93.7 శాతం తగ్గి 39.4 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో దేశ వాణిజ్య లోటు 31 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఏటా భారత్‌ 800-900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. మరో వైపు, రత్నాభరణాల ఎగుమతులు సైతం 2.7 బి. డాలర్ల నుంచి 9.1 బిలియన్‌ డాలర్లకు చేరాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని