ఆరోగ్య బీమా పాల‌సీలో మెట‌ర్నిటీ క‌వ‌రేజ్‌తో ప్ర‌యోజ‌నాలేంటి? - Maternity-coverage-benefits
close

Published : 06/02/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య బీమా పాల‌సీలో మెట‌ర్నిటీ క‌వ‌రేజ్‌తో ప్ర‌యోజ‌నాలేంటి?

త‌ల్లిదండ్రులు కావ‌డం అనేది జీవితంలో గొప్ప అనుభ‌వం. అయితే అదేస‌మ‌యంలో బాధ్య‌త‌లు కూడా పెరుగుతాయి. త‌ల్లిదండ్రులు కావాల‌నుకుంటే మొద‌ట ఆసుప‌త్రి ఖ‌ర్చులు వంటి వాటికి ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. రోజురోజుకు వైద్య వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆదాయం కూడా పెరుగుతున్న‌ప్ప‌టికీ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదిగ‌మించ‌లేక‌పోతున్నాయి. అందుకే మెట‌ర్నిటీ రైడ‌ర్‌తో కూడిన‌ ఆరోగ్య బీమా ఈ స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రి.

మెట‌ర్నిటీ హెల్త్ క‌వ‌ర్‌లో అవ‌స‌ర‌మైన‌ది:
కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో ఖ‌ర్చులు సాధార‌ణ డెలివ‌రీకి రూ.60 వేల నుంచి ఉంటాయి. దీంతో పాటు ప్ర‌స‌వానికి త‌ర్వాత, ముందు చాలా ఖ‌ర్చులు ఉంటాయి. డ‌యాగ్న‌స్టిక్ టెస్టులు, రూమ్ రెంట్, అంబులెన్స్ ఖ‌ర్చులు, ఇమ్యునైజేష‌న్‌, మందుల‌కు చాలా ఖ‌ర్చ‌వుతుంది. అందుకే ఒక మంచి మెట‌ర్నిటీ క‌వ‌ర్ ఉంటే ఈ ఖర్చుల‌ను చాలా వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.

మెట‌ర్నిటీ హెల్త్ బెనిఫిట్ అంటే ఏంటి?
మెట‌ర్నీటీ బీమా గ‌ర్భ‌ధార‌ణ‌కు సంబంధించిన ఖ‌ర్చుల‌న్నింటిని క‌వ‌ర్ చేస్తుంది. సాధార‌ణంగా ఈ ప్లాన్‌ల‌ను ప్ర‌త్యేకంగా కొనుగోలు చేసేందుకు వీలుండ‌దు. మీ ఆరోగ్య బీమా పాల‌సీకి అద‌నంగా ఇవి ల‌భిస్తాయి.

మెట‌ర్నిటీ క‌వ‌ర్‌తో కూడిన ఆరోగ్య బీమా పాల‌సీలుస్టార్ హెల్త్ వెడ్డింగ్ గిఫ్ట్ ప్రెగ్నెన్సీ క‌వ‌ర్‌
రెలిగేర్ జాయ్ మెట‌ర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్
మ్యాక్స్ బూపా హార్ట్‌బీట్ ఫ్యామిలీ ఫ‌స్ట్ ప్లాన్
అపోలో మ్యూనిచ్ ఈజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌
రాయ‌ల్ సుంద‌రం టోట‌ల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్ల‌స్ ప్లాన్
హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్ సుర‌క్షా గోల్డ్
రాయ‌ల్ సుంద‌రం లైఫ్‌లైన్ ఎలైట్‌
నేష‌న‌ల్ ప‌రివార్ మెడిక్లెయిమ్ ప్లాన్
ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు వీటిలో ఏదైనా ఎంచుకుంటే మెట‌ర్నిటీ క‌వ‌ర్ అద‌న‌పు ప్రీమియంతో ల‌భిస్తుంది. అయితే వ్య‌క్తిగ‌త, కుటుంబ లేదా గ్రూప్ ఆరోగ్య బీమాతో పాటు మెట‌ర్నిటీ క‌వ‌ర్‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు వెయింటింగ్ పీరియ‌డ్ 24 నుంచి 48 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. పిల్ల‌ల కోసం ప్లాన్ చేసుకునేట‌ప్పుడు ఈ మెట‌ర్నిటీ క‌వ‌ర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఏ అంశాల ఆధారంగా మెట‌ర్నిటీ ప్లాన్ ఎంచుకోవాలి?

మెట‌ర్నిటీ మెడిక‌ల్ ఖ‌ర్చుల ప‌రిమితులు
ప్రసూతి ప్రయోజనాలను అందించే అన్ని ఆరోగ్య బీమా పాలసీలు క్లెయిమ్ చేయగల గరిష్ట వ్యయానికి పరిమితిని ఇస్తాయి. ఈ పరిమితి కొంత మొత్తానికి ఫ లేదా మొత్తం బీమా మొత్తానికి అనుసంధానించి ఉంటుంది. దాదాపుగా అన్ని బీమా కంపెనీలు మెట‌ర్నిటీ ఖ‌ర్చుల‌కు రూ.50 వేలు లేదా అంత‌కంటే త‌క్కువ వ‌ర‌కు ప‌రిమితులు పెడ‌తాయి. కానీ ప్ర‌స‌వానికి త‌ర్వాత అయ్యే ఖ‌ర్చులు ల‌క్ష రూపాయ‌ల కంటే ఎక్కువ‌గానే ఉంటాయి. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుప‌త్రులైతే ఇంకా భారీగా ఉంటుంది. అందుకే మెట‌ర్నిటీ రైడ‌ర్ తీసుకునే ముందు ఎంత వ‌ర‌కు హామీ ల‌భిస్తుందో చూసుకోవాలి.
వెయిటింగ్ పీరియ‌డ్:
అన్ని మెట‌ర్నిటీ పాల‌సీల‌కు కొంత నిర్థిష్ట‌మైన వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. అది 24 నుంచి 48 నెల‌ల మ‌ధ్య ఉంటుంది. కొన్నింటికీ అంత‌కంటే ఎక్కువ‌గా కూడా ఉండ‌వ‌చ్చు. త‌క్కువ‌గా కూడా ఉండ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రెలిగేర్ హెల్త్ఇన్సూరెన్స్ మెట‌ర్నిటీ ప్లాన్ వెయిటింగ్ పీరియ‌డ్ కేవ‌లం 9 నెల‌లు మాత్ర‌మే. సంస్థ నుంచి గ్రూప్ పాల‌సీల‌ను తీసుకుంటే అద‌న‌పు ప్రీమియంతో వెయిటింగ్ పీరియ‌డ్‌ను త‌గ్గించ‌డం లేదా ర‌ద్దు చేయ‌డం చేస్తాయి.
క‌వ‌రేజ్:
కంపెనీలు వేర్వేరు మెట‌ర్నిటీ క‌వ‌రేజ్‌ను ఆఫ‌ర్ చేస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు కొన్ని కంపెనీలు కొత్త‌గా పుట్టిన శిశువుల‌కు, క‌వ‌ర్ ఫ‌ర్‌ ట‌ర్మినేష‌న్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అసోసియేటెడ్ ప్రెగ్నెన్నీ స‌మ‌యంలో వ‌చ్చే క్లిష్ట ప‌రిస్థితులు, ప్ర‌స‌వానికి ముందు త‌ర్వాత‌ ఖ‌ర్చులు వంటివి క‌వ‌ర్ చేస్తాయి. అదేవిధంగా ప్లాన్ రెండు ర‌కాల డెలివ‌రీల‌కు క‌వ‌రేజ్ ఇస్తుందో లేదో చేసుకోవాలి. ఇత‌ర ప‌రిమితులు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఈ ప్రయోజ‌నాల‌ను పొందాలంటే ముందు త‌ల్లికి వ్య‌క్తిగ‌త లేదా కుటుంబ ఆరోగ్య బీమా పాల‌సీ ఉండాలి.
చాలా వ‌ర‌కు ఆరోగ్య బీమా సంస్థ‌లు ఈ కింది ఖ‌ర్చుల‌కు హామీ అందించ‌వు..
కృత్రిమ గ‌ర్భ‌దార‌ణ ఖ‌ర్చుల‌కు
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అయితే ఈ ర‌క‌మైన ఖ‌ర్చులు బేస్ ప్లాన్‌లో క‌వ‌ర్ కావొచ్చు
ఇత‌ర క‌వ‌రేజ్‌లు
బీమా రంగం విస్త‌రించినకొద్ది సంస్థ‌లు కొత్త ఆఫ‌ర్ల‌ను , క‌వ‌రేజ్‌ల‌ను అందిస్తున్నాయి. పాల‌సీ కొనుగోలు చేసేముందు ఇంకా అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి.
ఆసుప‌త్రి ఖ‌ర్చులు:
చాలా బీమా సంస్థ‌లు ఆసుప‌త్రిలో చేరిన త‌ర్వాత రోజు అయ్యే ఖ‌ర్చుల‌ను అందిస్తాయి. కొన్ని పాల‌సీల‌లో గ‌ది అద్దె, ఐసీయూ ఛార్జీలు కూడా క‌వ‌ర్ చేస్తాయి.
అంబులెన్స్ ఛార్జీలు:
హామీని బ‌ట్టి కొన్ని పాల‌సీలకు అంబులెన్స్ క‌వ‌ర్ కూడా కొత్త క‌చ్చిత‌మైన మొత్తంతో అందిస్తాయి.

న‌గ‌దుర‌హిత స‌దుపాయం:
మంచి స‌దుపాయాలు , న‌గ‌దు ర‌హిత చెల్లింపులు ఉన్న హాస్పిట‌ల్ ఉన్న పాల‌సీల‌ను ఎంచుకోవాలి. న‌గ‌దుర‌హితంగా ఉంటే క్లెయిమ్ త్వ‌ర‌గా చేసుకునేందుకు వీలుంటుంది.

మెట‌ర్నిటీ క‌వ‌రేజ్ లేని ఖ‌ర్చులు:

బేస్ ప్లాన్‌లో లేని ఏ ఇత‌ర ఖ‌ర్చుల‌ను క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు

గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఎటువంటి నాన్ అల్లోప‌తి చికిత్స‌కు క‌వ‌రేజ్ ఉండ‌దు

ఇన్‌ఫెర్టిలిటీ చికిత్స‌కు సంబంధించి క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండ‌దు

గర్భం దాల్చిన తేదీ నుంచి మొదటి 12 వారాలలో వాలంట‌రీ ట‌ర్మినేష‌న్‌పై వైద్య ఖర్చులు కవర్ చేయ‌వు.

జ‌న్యులోపాల‌తో శిశువు జ‌న్మిస్తే అయ్యే ఖ‌ర్చుల‌కు బీమా హామీ ఉండ‌దు

కాబోయే త‌ల్లిదండ్రుల‌కు సూచ‌న‌:
ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేముందు స‌రైన నిర్ణ‌యం తీసుకోండి. మెట‌ర్నిటీ ప్లాన్ బేస్ ప్లాన్‌తో పాటు ల‌భిస్తుంది. అందుకే ఆరోగ్య బీమా పాల‌సీ విష‌యంలోనే జాగ్ర‌త్త వ‌హించాలి. మీకు అనుగుణంగా ఉన్న‌, ఎక్కువ ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించే పాల‌సీల‌నే ఎంచుకోండి. ఎక్కువ ప్రీమియం బేస్ ప్లాన్‌కే చెందుతుంది కాబ‌ట్టి స‌రైన పాల‌సీని ఎంచుకోండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని