​​​​మెక్‌ డొనాల్డ్స్‌ సమాచారం హ్యాక్‌! - McDonalds Hit by Data Breach
close

Published : 11/06/2021 21:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​మెక్‌ డొనాల్డ్స్‌ సమాచారం హ్యాక్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్ద పెద్ద కంపెనీలే లక్ష్యంగా హ్యాకింగ్‌ పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు మరో ప్రముఖ కంపెనీని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద బర్గర్‌ చైన్‌ మెక్‌డొనాల్డ్స్‌ కార్పొరేషన్‌కు చెందిన సమాచారం హ్యాకింగ్‌ గురైందని ఆ కంపెనీ వెల్లడించింది. అమెరికా, కొరియా, తైవాన్‌కు వ్యాపార కార్యకలాపాలకు చెందిన సమాచారం తస్కరణకు గురైనట్లు పేర్కొంది. కంపెనీకి చెందిన అంతర్గత భదత్రలో అనధికారిక కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు ఇటీవల నియమించుకున్న కన్సల్టెంట్ల జరిపిన పరిశోధనలో ఈ విషయం బహిర్గతం అయినట్లు కంపెనీ పేర్కొంది.

అయితే, ఇది రాన్సమ్‌వేర్‌ తరహాదాడి కాదని కంపెనీ పేర్కొంది. తస్కరణకు గురైన సమాచారంలో కస్టమర్ల వ్యక్తిగత సమాచారంతో పాటు, కొంతమంది ఉద్యోగుల సమాచారం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని నియంత్రణ సంస్థలతో పాటు, వినియోగదారులకు కూడా తెలియపరుస్తామని తెలిపింది. వినియోగదారుల పేమెంట్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదని పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని