డిస్కార్డ్‌పై మైక్రోసాఫ్ట్‌ దృష్టి..? - Microsoft In 10 Billion dlr Talks To Acquire This Business
close

Published : 23/03/2021 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిస్కార్డ్‌పై మైక్రోసాఫ్ట్‌ దృష్టి..?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డిస్కార్డ్‌ను కొనుగోలు చేసేందుకు టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ డీల్‌ కోసం 10 బిలియన్‌ డాలర్ల వరకు వెచ్చించేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. ఒక వేళ ఈ డీల్‌ కుదరకపోతే డిస్కార్డ్‌ ఐపీవోకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

‘‘మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డిస్కార్డ్‌ విక్రయానికి సిద్ధమైంది.  దీనిని కొనుగోలు చేయడానికి సిద్ధమైన చాలా బిడ్డర్లలో మైక్రోసాఫ్ట్‌ ఒకటి’’ అని పేర్కొంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు మైక్రోసాఫ్ట్‌ తిరస్కరించింది. గతేడాది డిసెంబర్‌లో డిస్కార్డ్‌ విలువను 7 బిలియన్‌ డాలర్లుగా లెక్కించారు. బృంద కార్యకలాపాల కోసం దీనిని వినియోగిస్తారు. గేమ్స్‌ ఆడటం, వర్చువల్‌గా పార్టీలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఎక్స్‌బాక్స్‌ వీడియోగేమ్‌ విభాగాన్ని పటిష్ఠపర్చుకొనేందుకు 7.5 బిలియన్‌ డాలర్లు వెచ్చించి జెనీమ్యాక్స్‌ మీడియాను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు గేమింగ్‌ రంగంలో అతిపెద్ద కొనుగోలు ఇదే. ఇక మైక్రోసాఫ్ట్‌కు కూడా గేమింగ్‌ విభాగంలో వ్యాపారం బాగుంది. 2016లో లింక్డ్‌ఇన్‌ కొనుగోలుతో మైక్రోసాఫ్ట్‌ సోషల్‌మీడియా విభాగంలోకి కూడా వచ్చింది. గతేడాది టిక్‌టాక్‌ను కొనుగోలు చేసి షార్ట్‌వీడియో రంగంలోకి రావాలని ప్రయత్నించినా.. అది విఫలమైంది. 

ఇవీ చదవండి

అదానీపరమైన గంగవరం పోర్టు!

మారటోరియం కాలాన్ని పొడిగించలేం


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని