LinkedIn: చైనాలో నిలిచిపోనున్న లింక్డిన్‌ సేవలు.. ఎందుకంటే? - Microsoft To Shut LinkedIn In China
close

Published : 16/10/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LinkedIn: చైనాలో నిలిచిపోనున్న లింక్డిన్‌ సేవలు.. ఎందుకంటే?

బీజింగ్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని లింక్డిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో లింక్డిన్‌ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. టెక్‌ సంస్థలపై అక్కడి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో లింక్డిన్‌ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని పేర్కొంది. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమే రూపొందించిన లింక్డిన్ సేవల్ని నిలిపివేయడం వల్ల ఆ వర్గం ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నట్లు పేర్కొంది. అయితే, దీంట్లో నెట్‌వర్కింగ్‌ ఫీచర్లు మాత్రం ఉండబోవని సంస్థ ఇంజినీరింగ్‌ విభాగం ఉపాధ్యక్షుడు మొహక్‌ ష్రాఫ్‌ తెలిపారు.

2014లో చైనాలో కార్యకలాపాల్ని ప్రారంభించిన లింక్డిన్‌కు ఇటీవల చైనా ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. లింక్డిన్‌లో సమాచారాన్ని మరింత నియంత్రించాలని అక్కడి సర్కార్‌ ఓ డెడ్‌లైన్ కూడా విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లింక్డిన్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని