Microsoft: భారత అంకుర సంస్థలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు? - Microsoft may invest in indian start up
close

Published : 30/07/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Microsoft: భారత అంకుర సంస్థలో మైక్రోసాఫ్ట్‌ భారీ పెట్టుబడులు?

దిల్లీ: భారత్‌కు చెందిన అతిపెద్ద అంకుర సంస్థ ఓయోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులతో ఓయో మార్కెట్‌ విలువ 9 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. ఓయో పబ్లిష్‌ ఇష్యూకు వచ్చేందుకు యోచిస్తున్నట్లు ఇటీవలే సంస్థ సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోపే మైక్రోసాఫ్ట్‌ పెట్టబడుల ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో ప్రారంభమైన ఓయోలో సాఫ్ట్‌ బ్యాంక్‌కు 46 శాతం వాటాలున్నాయి. హోటళ్ల అగ్రిగేటర్‌గా ఉన్న ఈ సంస్థ కరోనా మూలంగా గత కొంత కాలంగా నష్టాల్లో నడుస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని