close
Array ( ) 1

తాజా వార్తలు

మైక్రోసాఫ్ట్‌లో యువతకు మరిన్ని కొలువులు..

 న్యూదిల్లీ: టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించనుంది. నోయిడాలో సరికొత్త డెవలప్‌మెంట్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది.  భారత్‌లో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న మూడో హబ్‌ ఇది కావడం గమనార్హం. ఇది ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ హబ్‌గా సేవలు అందించనుంది. ‘‘మైక్రోసాఫ్ట్‌ ముందుగా కట్టుబడిన విధంగానే భారత్‌లోని ప్రతిభావంతులు ప్రపంచస్థాయిలో సేవలు అందించడానికి వీలుగా దీనిని నిర్మిస్తున్నాం. ప్రపంచ స్థాయిలో డిజిటల్‌ ఇన్నోవేషన్‌కు అవసరమైన సాంకేతికతన పంచుకునే వ్యూహంలో భాగంగానే ఇక్కడ ది ఇండియన్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాము. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ విస్తరణ, వృద్ధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.  ఈ కేంద్రాన్ని బెంగళూరు, హైదరాబాద్‌ స్థాయి ఐడీసీగా వృద్ధి చేస్తే వేలకొద్దీ ఇంజినీర్లకు అవకాశాలు వెల్లువెత్తుతాయి.’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. 
భవిష్యత్తులో ఈ సరికొత్త ఐడీసీ-ఎన్‌సీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ కీలక టెక్నాలజీలకు కేంద్రంగా మారుతుంది.  వీటిల్లో కృత్రిమ మేధ, క్లౌడ్‌, పరిశోధన, ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ డివైజ్‌ గ్రూప్‌, కోర్‌ సర్వీస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ విభాగాలు ఉండనున్నాయి. దీంతోపాటు హౌస్‌ మిక్సర్‌, మైక్రోసాఫ్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ గేమింగ్‌ విభాగాలు కూడా ఉండనున్నాయి. అమెరికాలోని రెడ్‌మాండ్లోని మైక్రోసాఫ్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌ బయట ఏర్పాటు చేస్తున్న  రెండో గేమింగ్‌ బృందం ఇక్కడే ఉండనుంది. 

‘‘గత 20 ఏళ్లుగా భారత్‌లో బలమైన ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పుడు మేము దీనిని విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నాము. దేశంలో ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండే ప్రతిభావంతులైన ఇంజినీర్ల నియమించుకొని ప్రపంచ స్థాయి సేవలను అందిస్తాము,’’ అని ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ కుర్త్‌ దెల్‌బెనె ప్రకటించారు. ఆయన ఐడీసీ అడ్వైజరీ బోర్డుకు అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.  తొలి ఐడీసీని 1998లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం మైక్రోసాఫ్ట్‌ విస్తరణలో కీలక పాత్ర పోషించింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.