MobiKwik IPO: మొబిక్విక్‌ ఐపీఓకు సెబీ ఆమోదం! - MobiKwik gets Sebi nod for Rs 1900 crore IPO
close

Published : 08/10/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MobiKwik IPO: మొబిక్విక్‌ ఐపీఓకు సెబీ ఆమోదం!

దిల్లీ: చెల్లింపు సేవల సంస్థ మొబిక్విక్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ ‘సెబీ’ ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,900 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ మొబిక్విక్‌ గత జులైలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఐపీఓలో రూ.1,500 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.400 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి.

కంపెనీలో వాటాదార్లుగా ఉన్న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, సిస్కో సిస్టమ్స్‌(యూఎస్‌ఏ), సెకోయా క్యాపిటల్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ III, సెకోయా క్యాపిటల్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ IV, ట్రీ లైన్‌ ఏషియా మాస్టర్‌ పండ్‌(సింగపూర్‌) సహా ప్రమోటర్లు ఉపాసన టకు, బిపిన్ ప్రీత్‌ సింగ్‌ తమ వాటాలను ఐపీఓలో విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వినియోగించనున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని