MobiKwik Unicorn: యూనికార్న్‌ క్లబ్‌లోకి మొబిక్విక్‌! - MobiKwik turns unicorn ahead of IPO
close

Published : 12/10/2021 21:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MobiKwik Unicorn: యూనికార్న్‌ క్లబ్‌లోకి మొబిక్విక్‌!

దిల్లీ: భారత్‌ నుంచి మరో అంకుర సంస్థ యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల విలువైన) క్లబ్‌లోకి చేరింది. త్వరలో ఐపీఓకి రానున్న చెల్లింపు సేవల సంస్థ మొబిక్విక్‌ ఈ ఘనత సాధించింది. తాజాగా ఈ సంస్థ సెకండరీ ఈఎస్‌ఓపీ(ఎంప్లాయి స్టాక్‌ ఓనర్‌షిప్‌) విక్రయాల ద్వారా భారీ ఎత్తున నిధులను సమీకరించినట్లు సమాచారం. ఎంత మొత్తం అన్నది మాత్రం తెలియరాలేదు. బ్లాక్‌స్టోన్‌ ఇండియా మాజీ సారథి మాథ్యూ సిరియాక్‌ తాజా సేల్‌లో అధిక మొత్తంలో షేర్లను కొన్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన కొన్న ధరతో పోలిస్తే దాదాపు రెట్టింపు వెచ్చించి వాటాలను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త పెట్టుబడితో.. మొబిక్విక్‌ విలువ 1 బిలియన్‌ డాలర్లకు చేరుకుని యూనికార్న్‌గా అవతరించింది. దీనిపై మొబిక్విక్‌ మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈఎస్‌ఓపీ 2014 స్కీమ్‌ ద్వారా మొబిక్విక్‌ అర్హతగల ఉద్యోగుల కోసం 4.5 మిలియన్ ఈక్విటీ షేర్లను రిజర్వ్‌ చేసింది.

మొబిక్విక్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ ‘సెబీ’ ఇటీవలే ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,900 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ మొబిక్విక్‌ గత జులైలో సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఐపీఓలో రూ.1,500 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.400 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి. కంపెనీలో వాటాదార్లుగా ఉన్న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, సిస్కో సిస్టమ్స్‌(యూఎస్‌ఏ), సెఖోయా క్యాపిటల్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌ III, సెఖోయా క్యాపిటల్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ IV, ట్రీ లైన్‌ ఏషియా మాస్టర్‌ పండ్‌(సింగపూర్‌) సహా ప్రమోటర్లు ఉపాసన టకు, బిపిన్ ప్రీత్‌ సింగ్‌ తమ వాటాలను ఐపీఓలో విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వినియోగించనున్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని