బడ్జెట్‌పై పారిశ్రామికవేత్తలు ఏమన్నారంటే..! - More reactions from industrialists on Budget 2021
close

Updated : 01/02/2021 22:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌పై పారిశ్రామికవేత్తలు ఏమన్నారంటే..!

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌పై వివిధ రంగాల నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది వృద్ధి ఆధారిత బడ్జెట్‌ అని కొందరు పేర్కొనగా.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నం చేసిందని మరికొందరు అభినందించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా నూతన దశాబ్దంలో ప్రవేశపెట్టిన ఇటువంటి బడ్జెట్‌ను గతంలో ఎన్నడూ చూడలేదు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలోనూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది.
 

 -  భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ సునీల్ భారతి మిట్టల్‌

ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్న సమయంలో ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం ముందుకెళ్లడంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందించాలి. రూ.5.54లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించడం, ఇది ప్రస్తుత ఏడాది కంటే 34.5శాతం ఎక్కువ. దీంతో మౌలిక, తయారీ రంగాలతో పాటు ఉద్యోగ కల్పన జరుగుతుంది.


- హిందూజా గ్రూప్‌ కో-ఛైర్మన్‌ గోపిచంద్‌ హిందూజా

ఆరోగ్య రంగానికి ప్రతిపాదించిన కేటాయింపులతో పాటు కొవిడ్‌ వ్యాక్సినైజేషన్‌, నిమోనియా వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత్‌ త్వరితగతిన కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థ ప్రాధాన్యతను ఆర్థిక మంత్రి నొక్కిచెప్పడాన్ని అభినందిస్తున్నాం. 

- అదర్‌ పూనావాలా

భారత వ్యాపార రంగాన్ని సంక్షోభ పరిస్థితుల నుంచి రికవరీ చేసి, మరింత దృఢమైన పునాదులపై నిలబెట్టేలా ఈ బడ్జెట్‌ రూపొందించారు. ఈ బడ్జెట్‌పై నేను ఆర్థిక మంత్రిని అభినందిస్తున్నాను.

- అజయ్‌ పిరమాల్‌, పిరమాల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌

ఇది దూరదృష్టి, వృద్ధి ఆధారిత బడ్జెట్‌. ఇది భారతదేశంలో పోటీతత్వాన్ని పెంపొందించడమే కాకుండా.. దేశ సమగ్ర వృద్ధిని ప్రోత్సహిస్తుంది. 

- సంజీవ్‌ పూరి, ఐటీసీ సీఎండీ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని