close

తాజా వార్తలు

1995లో ఎలన్‌ మస్క్‌ ఇలా..!

 ఫోటో షేర్‌ చేసిన మేయే మస్క్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం ఎలన్‌ మస్క్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు ఏవీ పెద్దగా బయటకు రావు. ఎప్పుడు ఆయన ప్రయోగాలు.. ప్రాజెక్టులకు సంబంధించినవే బయట ప్రపంచానికి తెలుస్తుంటాయి. తరచూ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఫొటోల్లోనే మస్క్‌ దర్శనమిస్తారు. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చిత్రాన్ని మస్క్‌ తల్లి మేయే మస్క్‌ ట్వటర్‌లో షేర్‌ చేశారు. దీనికి ఆమె ఆసక్తికరమైన క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

మేయే తాజాగా ఎలన్‌ మస్క్‌ 1995 నాటి చిత్రాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీనిలో మస్క్‌ ఒక షార్ట్‌, టీషర్ట్‌ వేసుకొని కారు తలుపును రిపేర్‌ చేస్తున్నట్లుంటుంది. దీనికి మస్క్‌ తల్లి ‘‘1995లో మస్క్‌. నీకు కార్ల గురించి ఏమీ తెలియదని జనాలు అన్నారు’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో మస్క్‌ 1978 నాటి బీఎండబ్ల్యూ కారుకు విరిగిన కిటికీ బాగు చేస్తూ కనిపించాడు.

ఈ ట్వీట్‌కు ఎలన్‌ మస్క్‌ రిప్లై ఇచ్చారు. ‘‘అప్పట్లో మరమ్మతులు చేయించేంత డబ్బులు లేవు. అందుకే తుక్కు దుకాణం నుంచి తెచ్చిన విడిభాగాలతో నేనే బాగు చేసుకున్నాను. హాస్యాస్పదంగా ఇప్పుడు పగిలిన కిటికీ(ఇటీవల సైబర్‌ ప్రదర్శన సందర్భంగా జరిగిన ఘటన)కి కూడా నేనే మరమ్మతులు చేసుకొంటున్నాను. సర్కిల్‌ ఇప్పటికి పూర్తైంది ’’ అని పేర్కొన్నారు. 

‘‘1993లో 1400 డాలర్లకు 1978 నాటి బీఎండబ్ల్యూ 320ఐ కారును కొన్నాను. దీని 5స్పీడ్‌ ట్రాన్స్‌మిషిన్‌ పనిచేయకపోవడంతో ఒక తుక్కు దుకాణంలో దొరికిన 4స్పీడ్‌ ట్రాన్స్‌మిషిన్ అమర్చాను’’ అని మస్క్‌ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొన్నారు. అప్పట్లో ఈ కారు అద్దం బద్దలు కొట్టి దొంగలు 20 డాలర్లు విలువైన రేడియోను అపహరించారు. దీంతో మస్క్‌ చేతికి పనిచెప్పి ఈ కారును బాగుచేసేందుకు పూనుకొన్నారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.