దోహా బ్యాంక్‌ పిటిషన్‌కు ఎన్‌సీఎల్‌టీ సమర్థింపు - NCLT justification for Doha Bank petition
close

Published : 04/03/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దోహా బ్యాంక్‌ పిటిషన్‌కు ఎన్‌సీఎల్‌టీ సమర్థింపు

రూ.3515 కోట్ల బకాయిల రికవరీ మార్గం సుగమం

దిల్లీ: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌కు చెందిన ఆర్థిక రుణదాతలకు ప్రాధాన్యతా పరంగా బకాయిలు చెల్లించాలంటూ దోహా బ్యాంక్‌ వేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) సమర్థించింది. ఎన్‌సీఎల్‌టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన రూ.4400 కోట్ల నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్రోపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కు చెల్లింపులు జరగాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఎస్‌బీఐ రూ.728 కోట్లు; మహిమా మర్కంటైల్‌ రూ.514 కోట్లు, ఎస్‌సీ లోవీ రూ.511 కోట్లు; వీటీబీ క్యాపిటల్‌ రూ.511 కోట్లు, దోహా బ్యాంకు రూ.409 కోట్లు; ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ రూ.322 కోట్లు; ఐసీబీసీ రూ.278 కోట్లు; స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ రూ.242 కోట్లు చొప్పున పొందుతాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ కూడా ఈక్విటీ, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కింద రూ.455 కోట్లు పొందుతుంది. మిగతా మొత్తాన్ని నిర్వహణ రుణదాతలు, ఉద్యోగులకు పంచుతారని ఆ వర్గాలు వివరించాయి. దోహా బ్యాంక్‌ విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ సమర్థించడంతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ రుణదాతలకు 100 శాతం బకాయిల రికవరీకి మార్గం సుగమం అయింది. ఈ పరిష్కార ప్రణాళిక మార్చి 31, 2021 కల్లా పూర్తవుతుందని అంచనా.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని