Nitin Gadkari : టోల్‌ ద్వారా ఏటా రూ.1.40 లక్షల కోట్లు! - NHAI will rake in annual toll income to Rs 1.40 lakh crore in the next 5 years
close

Published : 19/09/2021 14:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nitin Gadkari : టోల్‌ ద్వారా ఏటా రూ.1.40 లక్షల కోట్లు!

వచ్చే ఐదేళ్లలో సాధ్యమన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

దిల్లీ: ప్రతిష్ఠాత్మక దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రానున్న రోజుల్లో కాసుల వర్షం కురిపించనుందన్నారు. టోల్‌ రూపంలో ఎన్‌హెచ్‌ఏఐకి ఏటా వస్తున్న రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.

‘భారత్‌మాలా ప్రయోజన’లో భాగంగా నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే హరియాణా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ మీదుగా వెళ్తోంది. ఇది అందుబాటులోకి వస్తే దిల్లీ, ముంబయికి మధ్య ప్రయాణ సమయం 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గుతుంది. ఎన్‌హెచ్‌ఏఐ అప్పుల ఊబిలో కూరుకుపోతోందన్న ఆరోపణనను నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఈ నోడల్‌ ఏజెన్సీకి ‘ఏఏఏ’ క్రెడిట్‌ రేటింగ్‌ ఉందన్నారు. రానున్న కొన్నేళ్లలో కాసుల వర్షం కురిపిస్తుందన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ ఎప్పటికీ అప్పుల ఊబిలో కూరుకుపోదని ధీమా వ్యక్తం చేశారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని