Tokenisation: రూపేకార్డుల టోకనైజేషన్‌.. చెల్లింపుల్లో మరింత భద్రత - NPCI launches tokenisation of RuPay cards
close

Published : 20/10/2021 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokenisation: రూపేకార్డుల టోకనైజేషన్‌.. చెల్లింపుల్లో మరింత భద్రత

దిల్లీ: రూపే కార్డులను మరింత సురక్షితమైన చెల్లింపు సాధనాలుగా మార్చేందుకు టోకనైజేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) వెల్లడించింది. ఇకపై కార్డులకు సంబంధించిన గోప్యమైన సమాచారం టోకెన్‌ల రూపంలో భద్రంగా ఉంటుందని తెలిపింది. దీంతో చెల్లింపుల సమయంలో వ్యాపారులకు ఎలాంటి వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ టోకనైజేషన్‌ వల్ల లావాదేవీలు కూడా వేగంగా జరిగిపోతాయని తెలిపింది. దీనివల్ల డిజిటల్‌ చెల్లింపులు సైతం పెరుగుతాయని పేర్కొంది.

ఏంటీ టోకనైజేషన్‌..

చెల్లింపుల వ్యవస్థలో భద్రతను మెరుగుపరచడం కోసం టోకనైజేషన్‌ను తీసుకువచ్చారు. దీని ద్వారా వాస్తవ కార్డు వివరాలకు ప్రత్యామ్నాయంగా ఒక విశిష్ఠ కోడ్‌ ఉంటుంది. దీనిని ‘టోకెన్‌’ అంటారు. ఈ టోకెన్‌లో ఎలాంటి గోప్యమైన సమాచారం ఉండదు. కేవలం కార్డుకి సంబంధించిన వివరాల గుర్తింపునకు ఇచ్చిన రిఫరెన్స్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఇది అనుకోకుండా బహిర్గతమైనప్పటికీ.. ఎలాంటి ప్రమాదం ఉండదు. చెల్లింపుల సమయంలో కార్డు వివరాలకు బదులు టోకెన్ వివరాలను అందజేస్తే సరిపోతుంది. ఆ రిఫరెన్స్‌ ద్వారా కార్డు వివరాలను సరిచూసుకొని లావాదేవీని పూర్తి చేస్తుంది. ఇక్కడ వ్యాపారి వద్ద కార్డుకి సంబంధించిన ఎలాంటి వివరాలూ స్టోర్ కావు గనక మోసాలకు తావుండదు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని