వచ్చేవారం నజారా టెక్‌ ఐపీవో - Nazara Technologies Limited IPO
close

Updated : 12/03/2021 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చేవారం నజారా టెక్‌ ఐపీవో

క్యాండిక్రష్‌, సబ్‌వే సర్ఫర్‌, టెంపుల్‌ రన్‌ను రూపొందించింది ఈ సంస్థే
బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకూ వాటాలున్నాయి

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్యాండిక్రష్‌, సబ్‌వే సర్ఫర్‌, టెంపుల్‌ రన్‌ వంటి ప్రముఖ మొబైల్‌ గేమ్స్‌ను రూపొందించిన నజారా టెక్నాలజీస్‌ వచ్చే వారం పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోంది. షేర్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌గా పేరుగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు ఈ కంపెనీలో 11.51 శాతం వాటా ఉంది. తాజా ఇష్యూలో వాటాదార్లంతా తమ వాటాల్లో కొంత భాగాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తుండగా.. ఘున్‌ఝున్‌వాలా మాత్రం తన షేర్లను అట్టిపెట్టుకున్నారు. 

ఈ ఐపీవోకి సంబంధించిన వివరాలు...

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: మార్చి 17, 2021
ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: మార్చి 19, 2021
ముఖ విలువ: రూ.04 (ఒక్కో ఈక్విటీ షేరుకు)
లాట్‌ సైజు: 13 షేర్లు
కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 13(ఒక లాట్‌) 
గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 169 (13 లాట్లు)
ఐపీవో ధర శ్రేణి: రూ.1,100-1,101 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

సంస్థ వివరాలు...

నజారా టెక్నాలజీస్‌ 1999లో ముంబయి కేంద్రంగా ప్రారంభమైంది. భారత్‌లో మొబైల్‌ గేమ్స్‌ రూపొందిస్తున్న సంస్థల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణాసియా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికాలో కూడా ఈ సంస్థ గేమ్స్‌ను రూపొందిస్తుంటుంది. సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ బిజినెస్‌, ఫ్రీమియం బిజినెస్‌, ఈస్పోర్ట్స్‌ బిజినెస్‌, రియల్‌ మనీ గేమింగ్‌, గేమిఫైడ్‌ ఎర్లీ లెర్నింగ్‌ అనే మూడు వ్యాపార విభాగాలున్నాయి. అత్యధిక ఆదాయం గేమిఫైడ్‌ ఎర్లీ లెర్నింగ్‌, ఈస్పోర్ట్స్‌ బిజినెస్ విభాగంలో ఉన్న వినియోగదారులు చెల్లించే సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీల ద్వారా వస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈ రెండు విభాగాల నుంచి 71.03 శాతం ఆదాయం లభించింది.

మొత్తం 49,65,476 షేర్లను విక్రయిస్తున్నారు. ఇవన్నీ ప్రమోటర్లు, వాటాదార్లు తమ వాటాల్లోకి కొంత భాగాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నవే. తాజాగా ఐపీవోకి తెస్తున్న కొత్త వాటాలేవీ లేవు. ఈ ఇష్యూలో కొంత భాగాన్ని సంస్థలోని ఉద్యోగుల కోసం రిజర్వు చేశారు. వారికి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.110 రాయితీ కూడా ఇవ్వనున్నారు. ఇక 75 శాతం సంస్థాగత పెట్టుబడిదారులకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 10 శాతం రిటైల్‌ మదుపర్లకు కేటాయించారు. భారత్‌లో భారీ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తుల్లో గేమింగ్‌ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు భావిస్తున్నారు. పైగా యువత అత్యధిక సమయం గేమ్స్‌పై వెచ్చిస్తుండడం, భారత్‌లో డేటా ఛార్జీలు తక్కువగా ఉండడం వంటి కారణాలు భవిష్యత్తులో ఈ కంపెనీ మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రస్తుత పనితీరును బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో ఈ కంపెనీ 30 శాతం సీఏజీర్‌(కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌) చొప్పున వృద్ధి చెందే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ అనే సంస్థ అంచనా వేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని