లిస్టయిన తొలిరోజే దుమ్మురేపిన నజారా టెక్‌ షేర్లు! - Nazara Technologies shares list at nearly 81 pc premium
close

Updated : 30/03/2021 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లిస్టయిన తొలిరోజే దుమ్మురేపిన నజారా టెక్‌ షేర్లు!

ముంబయి: ప్రముఖ మొబైల్‌ గేమ్స్‌ను రూపొందించిన నజారా టెక్నాలజీస్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన తొలిరోజే దుమ్మురేపాయి. మంగళవారం ఈ కంపెనీ షేర్లు 81 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. గత వారమే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ షేర్ల ఇష్యూ ధరను రూ.1,101గా నిర్ణయించారు. ఈరోజు బీఎస్‌ఈలో ఒక్కో షేరు ధర రూ.1,971 వద్ద ప్రారంభమైంది. ఓ దశలో 84 శాతం ఎగిసి రూ.2,026 వద్ద ట్రేడయింది. ఇక నిఫ్టీలో ఈ కంపెనీ షేర్లు 1,990 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.

ఈ కంపెనీ ఐపీఓకు భారీ స్పందన లభించింది. వ్యవస్థాపక మదుపర్లు ఈ కంపెనీ షేర్లపై భారీ ఆసక్తి కనబరిచారు. దాదాపు 175.46 శాతం సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం. షేర్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌గా పేరుగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు ఈ కంపెనీలో 11.51 శాతం వాటా ఉంది.

నజారా టెక్నాలజీస్‌ 1999లో ముంబయి కేంద్రంగా ప్రారంభమైంది. భారత్‌లో మొబైల్‌ గేమ్స్‌ రూపొందిస్తున్న సంస్థల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణాసియా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికాలో కూడా ఈ సంస్థ గేమ్స్‌ను రూపొందిస్తుంటుంది. భారత్‌లో భారీ స్థాయిలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో గేమింగ్‌ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు భావిస్తున్నారు. పైగా యువత అత్యధిక సమయం గేమ్స్‌పై వెచ్చిస్తుండడం, భారత్‌లో డేటా ఛార్జీలు తక్కువగా ఉండడం వంటి కారణాలు భవిష్యత్తులో ఈ కంపెనీకి మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని