మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా? - Need-of-Top-policy
close

Updated : 01/01/2021 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా?

ఆరోగ్య బీమా ఎంచుకున్న పరిమితి మేరకు మాత్రమే వైద్యఖర్చులను చెల్లిస్తుంది. ఒక వేళ మనకేదైనా అనారోగ్యం వచ్చి ఆరోగ్య బీమా పాలసీ అందించే బీమా సొమ్ముకు మించి ఖర్చైతే మిగతా సొమ్మును మన చేతి నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా అని ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవాలి అంటే ప్రీమియం అధికంగా చెల్లించడం భారం అవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రూపొందించినవే ‘టాప్అప్ పాలసీలు’. అందుబాటులో ఉండే ప్రీమియంతో అవసరం అయినప్పుడు అధిక మొత్తంలో బీమా చెల్లించి ఆదుకునే వీలును టాప్అప్ కల్పిస్తాయి.

ఆరోగ్య బీమాలో అందించే హామీ సొమ్ము పరిధి ‘త్రెషోల్డ్‌ లిమిట్‌’ దాటాక టాప్‌ అప్‌ అందుబాటులోకి వస్తుంది. అదనపు బీమా సొమ్ము కావాలనుకున్న వ్యక్తులు లేదా పెరుగుతున్న వైద్య ఖర్చులకు ప్రస్తుత పాల‌సీ సరిపోదని భావించినట్టయితే టాప్‌ అప్‌ పాలసీ తీసుకోవడం మంచిది.

టాప్‌ అప్‌ పాలసీల ప్రత్యేకతలు

  • ఈ టాప్‌ అప్‌ పాలసీల ప్రీమియం, సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆర్యోగ బీమా పొందేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి.

  • టాప్‌ అప్‌ పాలసీని మనకున్న ఆరోగ్య బీమా కంపెనీతోనే తీసుకోవాలనే నిబంధనేమీ లేదు. ఇతర కంపెనీల టాప్‌ అప్‌ పాలసీలు తీసుకునే వీలుంది.

  • టాప్‌ అప్‌ పాలసీలు వ్యక్తిగతంగా లేదా కుటుంబమంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి అదనంగా తీసుకోవచ్చు.

  • రూ.3లక్షల నుంచి రూ.15లక్షల వరకు అదనపు బీమా కల్పించే టాప్‌ అప్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

  • సాధారణ ఆరోగ్య బీమా పాలసీ లేకుండా కూడా టాప్‌ అప్‌ పాలసీలు తీసుకునే వీలుంది.

  • ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యల ( ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజెస్‌)కు, పాలసీ తీసుకున్న తర్వాత 2- 4ఏళ్ల తర్వాత నుంచి బీమా పరిహారం వర్తిస్తుంది.

  • అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరిన ప్రతిసారి అయిన ఖర్చు విడివిడిగానే పరిగణిస్తారు. అంతేకానీ వీటన్నింటినీ కలిపి ఒక ఏడాదిలో కనీస పరిమితి దాటినట్లుగా లెక్కలోకి తీసుకోరు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
టాప్‌ అప్‌ పాలసీలను ఆరోగ్య బీమా బేస్ పాలసీలకు ప్రత్యామ్నాయంగా చూడకుండా కేవలం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా పొందేందుకు ఉపయోగపడే సాధనాలుగా పరిగణిస్తే మంచిది. ఆరోగ్య బీమా బేస్ పాలసీలు అయితే చిన్న మొత్తాలకు సైతం బీమా పొందేందుకు సౌకర్యం ఉంటుంది. అదే ఈ టాప్‌ అప్‌ పాలసీల్లో కనీస పరిమితి దాటాక మాత్రమే బీమా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే దీనినే ’ త్రెషోల్డ్‌ లిమిట్‌’ అంటారు. కాబట్టి ముందుగా బేస్ పాలసీ ఉన్న వారు మాత్రమే టాప్-అప్ గురించి ఆలోచించడం మంచిది. లేకపోతే , ఆ మేరకు ఖర్చులను స్వంతంగా చెల్లించాల్సి ఉంటుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని