అంచనాలు దాటిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..! - Net direct tax mop up exceeds revised estimates
close

Published : 09/04/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంచనాలు దాటిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో ప్రత్యక్ష పన్ను రూపంలో ఆదాయం అంచనాకు మించి లభించింది. ‘‘2020-21 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌-19 నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా నికరంగా ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో వృద్ధి సాధించాం’’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు డైరెక్టర్‌ ప్రమోద్‌ చంద్ర మోడీ శుక్రవారం తెలిపారు.  ఈ సారి ప్రత్యక్ష పన్నుల ఆదాయం మార్చి 31నాటికి నికరంగా రూ. 9.45 లక్షల కోట్లు సమకూరింది. ఇది గత బడ్జెట్‌లో సవరించిన అంచనాల కంటే 5శాతం ఎక్కువ.

ఈ సందర్భంగా సీబీడీటీ ఛైర్మన్‌ ప్రమోద్‌ మోదీ మాట్లాడుతూ ఆదాయపు పన్నుశాఖ  ఈ రెవెన్యూ అంచనాలను దాటిందన్నారు. రిఫండ్స్‌ పెరిగినా.. ఈ స్థాయిలో నమోదు కావడం విశేషమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కార్పొరేట్‌ పన్నుల రూపంలో రూ.4.57 లక్షల కోట్ల ఆదాయం లభించగా.. ఇక ఆదాయపు పన్ను రూపంలో 4.71లక్షల కోట్లు లభించిందన్నారు. ఇక సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.16,927 కోట్ల ఆదాయం వచ్చింది.  2020-21 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుఆదాయం రూ.9.05 లక్షలు రావాల్సిఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని